Team India: నాలుగో టీ20... టీమిండియా స్కోరు 9 వికెట్లకు 181 పరుగులు

Team India scored 181 runs for 9 wickets in 4th T20

  • పుణేలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • అర్ధసెంచరీలతో రాణించిన శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా
  • తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్

పుణేలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టీ20 జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. శివమ్ దూబే (53), హార్దిక్ పాండ్యా (53) అర్ధసెంచరీలతో అలరించారు. రింకూ సింగ్ 30, అభిషేక్ శర్మ 29 పరుగులు చేశారు. సంజూ శాంసన్ 1 పరుగుకే అవుట్ కాగా... తిలక్ వర్మ (0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యారు. 

ఓ దశలో టీమిండియా 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిషేక్ శర్మ, రింకూ సింగ్ ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఆ తర్వాత శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా టీమిండియాకు భారీ స్కోరు అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకిబ్ మహమూద్ 3, జేమీ ఒవెర్టన్ 2, బ్రైడన్ కార్స్ 1, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ జట్టు 7 ఓవర్లలో 2 వికెట్లకు 65 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 23, బెన్ డకెట్ 39 పరుగులు చేసి అవుటయ్యారు. టీమిండియా స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. 

ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 78 బంతుల్లో 117 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News