Janamloki Janasena: ఫిబ్రవరి 2న పుంగనూరు నియోజకవర్గంలో జనసేన బహిరంగ సభ

Janasena rally in Punganuru constituency on Feb 2
  • 'జనంలోకి జనసేన' సభ
  • సోమల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో సభ
  • ముఖ్య అతిథిగా నాగబాబు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి 2న 'జనంలోకి జనసేన' బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

నియోజకవర్గంలోని సోమల మండలం కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ లో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నాగబాబుతో పాటు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన చిత్తూరు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

Janamloki Janasena
Punganuru
Nagababu
Chittoor District

More Telugu News