KCR: హరీశ్ రావును పక్కన కూర్చోబెట్టుకొని బెంజ్ కారు నడిపిన కేసీఆర్... వీడియో ఇదిగో

KCR drives car to Farm House

  • ఫాంహౌస్‌లో జహీరాబాద్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం
  • కేసీఆర్ కారులో వచ్చిన హరీశ్ రావు
  • సమావేశానికి హాజరైన హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మేనల్లుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును మెర్సిడెస్ బెంజ్ కారులో వెంటబెట్టుకొని వచ్చారు. హరీశ్ రావును తన పక్కనే ముందు సీట్లో కూర్చోబెట్టుకుని కేసీఆర్ స్వయంగా కారు నడుపుకుంటూ ఫాంహౌస్‌కు చేరుకున్నారు.

ఈరోజు ఆయన జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో తన ఫాంహౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి కేసీఆర్ స్వయంగా కారు నడుపుకుంటూ రాగా, డ్రైవింగ్ సీటు పక్కన హరీశ్ రావు కూర్చోవడం విశేషం.

More Telugu News