Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు షాక్

7 MLAs Resign From Arvind Kejriwal AAP

  • పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు
  • మరో ఐదు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • కేజ్రీవాల్, పార్టీపై విశ్వాసం కోల్పోయామని ఎమ్మెల్యేల రాజీనామా
  • ఈసారి ఎన్నికల్లో పోటీకి అవకాశం రాని ఏడుగురు ఎమ్మెల్యేలు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. పోలింగ్‌కు మరో నాలుగైదు రోజులు మాత్రమే గడువు ఉండగా, ఇలాంటి కీలక సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆందోళన కలిగిస్తోంది.

కేజ్రీవాల్ నాయకత్వంపై, పార్టీపై విశ్వాసం కోల్పోయిన కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు భావనా గౌర్, మదన్ లాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు వారు తమ రాజీనామా లేఖలను కేజ్రీవాల్‌కు పంపించారు.

'పార్టీ పట్ల, మీ పట్ల విశ్వాసం కోల్పోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి' అని భావనా గౌర్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇదే బాటలో మెహ్రాలియా, రాజేశ్ రిషి, మదన్ లాల్, నరేశ్ యాదవ్, పవన్ శర్మ, భూపిందర్ సింగ్ జూన్ రాజీనామా చేశారు. అయితే, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరికి పార్టీ అవకాశం కల్పించలేదు.

  • Loading...

More Telugu News