Revanth Reddy: కేసీఆర్‌ను రాఖీ సావంత్‌తో పోల్చిన రేవంత్ రెడ్డి!

Revanth Reddy compares KCR with Rakhi Sawanth

  • కేసీఆర్ బలంగా కొట్టడం కాదు, ముందు సరిగ్గా నిలబడటం నేర్చుకోవాలన్న రేవంత్ రెడ్డి
  • బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆగ్రహం
  • ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదని విమర్శ

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొడితే బలంగా కొడతానని కేసీఆర్ అంటున్నారని, కానీ ఆయన ముందు సరిగ్గా నిలబడటం నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. "అసలు నువ్వు ఊగుతున్నావా? తూలుతున్నావా?" అని వ్యంగ్యంగా అన్నారు.

"నాకు, కేసీఆర్‌కు పోల్ పెడితే (సోషల్ మీడియాలో) ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయట. సల్మాన్ ఖాన్, రాఖీ సావంత్‌కు పోల్ పెడితే రాఖీకే ఎక్కువ ఓట్లు వస్తాయి. అంత మాత్రాన సల్మాన్ ఖాన్ స్టార్ కాకుండా పోతాడా?" అని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు. రైతుబంధు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకు వచ్చారన్నారు. ధనిక రాష్ట్రమంటూ అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌లా మాట ఇచ్చి ఎగ్గొట్టేవాడిని కాదని, ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. దళితబంధు, రైతుబంధు ఎగ్గొట్టాడని విమర్శించారు.

అబద్ధాలు చెప్పడం వల్లే కేసీఆర్ ఓడిపోయారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్ లో కూర్చుని సోది చెప్పడం కాదని, కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. అసెంబ్లీకి వస్తే ఏ గ్రామంలో, ఏ రైతుకు ఎంత రుణమాఫీ చేశామో చెబుతామన్నారు. 14 నెలలుగా ఫాంహౌస్‌లో కూర్చొని గంభీరంగా చూస్తున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేటీఆర్, హరీశ్ రావులను మనపైకి వదిలాడని మండిపడ్డారు.

ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ఏబీసీడీ వర్గీకరణ చేద్దామన్నారు. కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాడన్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి, జహంగీర్ పీర్ దర్గాకు రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పి మాట తప్పాడన్నారు. పాలమూరు ప్రాజెక్టును ఎండబెట్టాడని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News