Duvvada-Divvela Madhuri: వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెడుతున్న దువ్వాడ-దివ్వెల మాధురి!

Duvvada and Divvela Madhuri enters into textile business

  • గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా దువ్వాడ శ్రీనివాస్, మాధురి అనుబంధం
  • హైదరాబాదులోని చందానగర్ లో షోరూం ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • ఫిబ్రవరి 21న షోరూం ప్రారంభం!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్నాళ్లుగా వారు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా ఉన్నారు. కుటుంబ గొడవలు అయితేనేమి, జంటగా పర్యటనలు చేయడం అయితేనేమి... వారు ఎక్కడున్నా మీడియా ఫోకస్ అంతా వారిపైనే ఉంటుంది. 

తాజాగా, దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జోడీ వ్యాపారం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏదో సాదాసీదాగా కాకుండా, కోట్ల రూపాయలతో వస్త్ర వ్యాపారం రంగంలోకి అడుగుపెడుతున్నారు. 

వారు తమ మొదటి షోరూంను హైదరాబాదులోని చందానగర్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు, వచ్చే నెల 21 షోరూం ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ షోరూంకు 'కాంచీపురం వకుళ సిల్క్స్' అనే పేరును ఖరారు చేశారు.

Duvvada-Divvela Madhuri
Textile Business
Hyderabad
YSRCP

More Telugu News