Pilli Subhas Chandra Bose: పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

YSRCP MP Pilli Subhash Chandrabose collpsed in Parliament

  • షుగర్ డౌన్ అయి పడిపోయిన సుభాష్ చంద్రబోస్
  • పార్లమెంటులోనే ప్రథమ చికిత్స అందించిన వైద్యులు
  • ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో అస్వస్థత

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు పార్లమెంటులోకి వస్తున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఈ విషయాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. 

కళ్లు తిరిగి పడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను గమనించిన సిబ్బంది వెంటనే తమకు, వైద్యులకు సమాచారం అందించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పార్లమెంట్ లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రాథమిక చికిత్స అందించారని వెల్లడించారు. షుగర్ బాగా డౌన్ అయిందని, ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల ఇలా అయిందని డాక్టర్లు తెలిపారని చెప్పారు. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించి, మరోసారి వైద్య పరీక్షలు చేయించామని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. 

  • Loading...

More Telugu News