Jagan: లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న జగన్

Jagan reached Bengaluru from London

  • భార్య భారతితో కలిసి లండన్ కు వెళ్లిన జగన్
  • కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ దంపతులు
  • ఫిబ్రవరి 3న తాడేపల్లికి వచ్చే అవకాశం

వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ముగిసింది. లండన్ నుంచి ఈరోజు ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నెల 14న జగన్, తన భార్య భారతితో కలిసి లండన్ కు వెళ్లారు. తమ కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. 15 రోజులకు పైగా వీరు లండన్ లో ఉన్నారు. 

బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 3న ఆయన తాడేపల్లిలోని నివాసానికి వచ్చే అవకాశం ఉంది. తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. పార్టీ నేతలపై కేసులు, తాజా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News