Priyanka Chopra: 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' మూవీ కోసం ప్రియాంక చోప్రాకు మైండ్‌బ్లోయింగ్‌ రెమ్యునరేషన్‌...!

Priyanka Chopra Top Remuneration for SSMB 29

  • మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి కాంబోలో 'ఎస్ఎస్ఎంబీ 29' 
  • హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 
  • ప్రాజెక్ట్‌ కోసం ప్రియాంక ఏకంగా రూ. 30 కోట్లు పారితోషకంగా తీసుకుంటోంద‌ని టాక్‌

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న భారీ బడ్జెట్‌, యాక్ష‌న్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌ 'ఎస్ఎస్ఎంబీ 29'. ఇందులో మ‌హేశ్ బాబు సరసన హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్న విష‌యం తెలిసిందే. 

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది అన్న విషయం ఆమె హైదరాబాదులో అడుగు పెట్టిన తర్వాత కన్ఫర్మ్ అయింది. ఇక తాజాగా కీరవాణి, రాజమౌళిలతో కలిసి దిగిన ఫొటోలు వైరల్ కావడంతో ఆమె హీరోయిన్ అని స్వయంగా రాజమౌళి నిర్ధారించిన‌ట్టు అయ్యింది. 

ఇక, పాన్ వరల్డ్ సినిమాగా రూపొందబోతున్న ఈ మూవీ కోసం ఆమెకు భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న‌ట్లు తాజాగా నెట్టింట ఓ వార్త బాగా హ‌ల్‌చ‌ల్‌ చేస్తోంది. 

తాజా కథనాల ప్రకారం జక్కన్న ప్రాజెక్ట్‌ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్లు పారితోషికంగా అందుకుంటోందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో రీఎంట్రీ తర్వాత ఆమె తీసుకుంటున్న భారీ మొత్తం ఇదే అవుతుందనేది సినీ వ‌ర్గాల మాట‌. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియ‌దు. 

మరోవైపు జక్కన్న 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ పూజా కార్యక్రమాలను ఎలాంటి హడావుడి లేకుండా ఈనెల ప్రారంభంలోనే పూర్తి చేశారు. ఇక ఇప్పుడు చిత్ర‌బృందం ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ షూటింగ్‌ను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ, కెన్యా అడవుల్లో, అలాగే మరికొన్ని కీ లొకేషన్లలో షూట్ చేయబోతున్నారని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లోనే జరుగుతుందనేది తాజా అప్‌డేట్‌. 

More Telugu News