Chandrababu: కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు

- పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన
- వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు
- పెనుగొండలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం
సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో పర్యటిస్తున్నారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధానార్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెనుగొండలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.