Prabhas: హీరోయిన్ కు ఇంటి భోజనం పంపించిన ప్రభాస్... వీడియో ఇదిగో!

Actress Imanvi tastes Prabhas home food

  • 'ఫౌజీ' సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న ఇమాన్వీ
  • రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్
  • బ్రేక్ లో ప్రభాస్ ఇంటి భోజనాన్ని రుచి చూసిన ఇమాన్వీ

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కోసం రెడీ చేసుకున్న కథలతో డైరెక్టర్లు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నా... ప్రభాస్ డేట్స్ మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఫౌజీ' ఒకటి. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది.   

మరోవైపు, సెట్స్ కు ప్రభాస్ ఇంటి నుంచి పలు రుచికరమైన వంటకాలతో కూడిన భోజనం వస్తుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ ఇంటి భోజనానికి, ఆయన ఆతిథ్యానికి ఎంతో మంది సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ జాబితాలో ఇమాన్వీ కూడా చేరిపోయింది. 

ప్రస్తుతం 'ఫౌజీ' షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇమాన్వీ కోసం ప్రభాస్ ఇంట్లో వండిన భోజనం వచ్చింది. షూటింగ్ బ్రేక్ టైమ్ లో ఈ భోజనాన్ని ఇమాన్వీ రుచి చూసింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. రుచికరమైన భోజనాన్ని రుచి చూపించిన ప్రభాస్ కు ధన్యవాదాలు అని కామెంట్ పెట్టింది.

More Telugu News