Narendra Modi: పేద, మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలి: మోదీ

Prayers for the continued blessings of Maa Lakshmi on the poor and middle class says Modi

  • నేటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు
  • అన్ని అంశాలపై చర్చ జరగాలన్న మోదీ
  • వికసిత్ భారత్ కు ఈ బడ్జెట్ ఊతమిస్తుందన్న ప్రధాని

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కాసేపటి క్రితం పార్లమెంట్ కు చేరుకున్న మోదీ... పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షించారు. బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని కోరుతున్నానని చెప్పారు. వికసిత్ భారత్ కు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని అన్నారు.

రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్ఫామ్ లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని మోదీ తెలిపారు. ఇన్నొవేషన్, ఇన్ క్లూజన్, ఇన్వెస్ట్ మెంట్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. అంతర్జాతీయంగా మన దేశ పరపతి పెరుగుతోందని చెప్పారు. 2047 కల్లా మన దేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News