Tanuku: తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్!

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సై ఏజీఎస్ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆయన.. ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.