Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మిత్రుడా? శత్రువా? అని అడిగితే జైశంకర్ సమాధానమిదే

Jaishankar Praises Trump Calls Him an American Nationalist

  • ట్రంప్ ఒక జాతీయవాది అన్న జైశంకర్
  • భారత్ దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుందన్న జైశంకర్
  • నరేంద్ర మోదీకి ట్రంప్‌తో మంచి స్నేహముందన్న కేంద్రమంత్రి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మిత్రుడా? శత్రువా? అని అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్సరాజ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరయ్యానని, మనకు ఎంతో గౌరవం లభించిందన్నారు. ఆయన ఒక జాతీయవాది అని తాను విశ్వసిస్తున్నానన్నారు.

ట్రంప్ విధానాలతో ప్రపంచ వ్యవహారాల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, భారత్ మాత్రం దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అమెరికాతో మన బంధం బలంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్రంప్‌తో మంచి స్నేహముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రభావం పెరుగుతోందన్నారు.

కొందరు భారతీయేతరులు తమను తాము భారతీయులుగా చెప్తున్నారని విమర్శించారు. విమానంలోనో, ఇంకోచోటో తమకు సీటు దక్కేందుకు అది ఉపయోగపడుతుందని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News