Leopard: తిరుమలలో చిరుత సంచారం.. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ

- శిలాతోరణం వద్ద చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు
- టీటీడీ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన భక్తులు
- సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు
తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద ఈరోజు సాయంత్రం చిరుతపులి సంచరిస్తున్నట్లు పలువురు భక్తులు గుర్తించారు. వెంటనే వారు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.