Andhra Pradesh: ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

New registration charges in Andhra Pradesh from Feb 1

  • మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరించాలని నిర్ణయం
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా ఆదేశించారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయా ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీల విలువల పెంపు లేదా తగ్గింపునకు అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కొన్ని చోట్ల రద్దీ నెలకొంది. కొన్ని చోట్ల రాత్రి వేళల్లో కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలు, స్ట్రక్చర్ విలువలను సవరించాలి. అయితే గత వైసీపీ ప్రభుత్వం విలువలను భారీగా పెంచిందని భావించిన ఏపీ ప్రభుత్వం, వీటిని సవరించాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News