Peddireddi Ramachandra Reddy: జగన్ మళ్లీ సీఎం అవుతారు... టీడీపీ కార్యకర్తల తాట తీస్తాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

- వైసీపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందన్న పెద్దిరెడ్డి
- వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల భరతం పడతామని హెచ్చరిక
- వైసీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదన్న పెద్దిరెడ్డి
టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు టీడీపీ కార్యకర్తల తాట తీస్తామని హెచ్చరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందని అన్నారు. సోషల్ మీడియా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
గ్రామ స్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల భరతం పడతామని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలపై చేసిన దాడులకు కచ్చితంగా ప్రతిదాడులు ఉంటాయని చెప్పారు. తమ తడాఖా ఏందో రుచి చూపిస్తామని అన్నారు. ఇకపై ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని జగన్ చెప్పారని... ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.