Mahira Sharma: క్రికెటర్ సిరాజ్‌తో మహిరా శర్మ డేటింగ్ ప్రచారంపై స్పందించిన తల్లి

- బిగ్‌బాస్ ఫేమ్ మహిరాతో సిరా్ డేటింగ్ అంటూ జోరుగా ప్రచారం
- ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని మహిరా శర్మ తల్లి విజ్ఞప్తి
- బయటివాళ్లు ఎన్నో అంటుంటారు... అలాంటివి నమ్మాలా? అని అసహనం
భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌తో హిందీ బిగ్‌బాస్ ఫేమ్ మహిరా శర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయని ఆంగ్ల మాధ్యమాలు కథనాలు ప్రచురించాయి. మహిరా చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టును సిరాజ్ లైక్ చేయడంతో పాటు ఆమెను ఫాలో అవుతుండటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో, సిరాజ్, మహిరా డేటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మహిరా శర్మ తల్లి స్పందించారు.
ఇలాంటి నిరాధారమైన ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని మహిరా శర్మ తల్లి సానియా శర్మ విజ్ఞప్తి చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ, "అసలు మీరేం మాట్లాడుతున్నారు? బయటి వ్యక్తులు అనేక విషయాలు చెబుతుంటారు. నా కుమార్తె ఇప్పుడు ఒక సెలబ్రిటీ. దీంతో అభిమానులు ఆమెకు ఎవరితోనో సంబంధాలు అంటగడుతుంటారు. వాటిని నమ్మాలా? ఇలాంటి వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం" అని ఖండించారు.