Monalisa: మోనాలిసాకు బాలీవుడ్ మూవీలో ఛాన్స్.. తొలి చిత్రానికి సంతకం చేసిన ఇంటర్నెట్ సెన్సేషన్!

- మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోనాలిసా
- రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయిన పూసలమ్ముకునే అమ్మాయి
- ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ చిత్రంలో నటించే ఆఫర్
- దర్శకుడు సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీలో ఛాన్స్
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో పూసలమ్ముకునే 16 ఏళ్ల అమ్మాయి రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమె అందానికి ఫిదా అయిన వారు మోసాలిసాతో ఫొటోలు, వీడియోల కోసం ఎగబడ్డారు. చివరికి ఆమెను అక్కడ ఉండేందుకు కూడా వీలు లేకుండా చేశారు.
కుంభమేళాలో మోనాలిసా ఎక్కడ కనిపించినా వెంటపడి మరీ ఫొటోలు దిగడం చేస్తుండడంతో ఆమె వ్యాపారం దెబ్బతింది. దాంతో చేసేదేమిలేక మోనాలిసా తండ్రి ఆమెను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. అయితే, ఆమె తాలూకు వీడియోలు, ఫొటోలు అప్పటికే నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆమె పేరే మార్మోగిపోతోంది.
ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ చిత్రంలో నటించే ఆఫర్ కొట్టేసింది మోనాలిసా. తాజాగా ఆమె తన తొలి చిత్రానికి సంతకం కూడా చేసేసింది. దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవల తాను ప్రకటించినట్లుగా తన చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ పేరుతో తెరకెక్కనున్న తన మూవీలో మోనాలిసాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా సనోజ్ మిశ్రా స్వయంగా మోనాలిసా ఉండే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లారు. ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించారు. అనంతరం తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. ఇక చిత్రీకరణకు ముందు ముంబయిలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించనున్నారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు సమాచారం.