Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud key announcement on Local Body Elections

  • రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న టీపీసీసీ చీఫ్
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా
  • కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగా కొంతమేరకు పథకాలు అందడం లేదని వ్యాఖ్య

రిజర్వేషన్ల పెంపు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కులగణన నివేదికపై ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే ప్రశ్నకు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగా కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి పంపించామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News