CM Nitish Kumar: మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తూ సీఎం నితీశ్ చేసిన పనిపై విమర్శలు.. వీడియో వైరల్!

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన పని విమర్శలకు దారితీసింది. గాంధీకి నివాళులర్పిస్తూ సీఎం నితీశ్ చప్పట్లు కొట్టారు. అది గమనించిన స్పీకర్ సైగలు చేయడంతో ఆపేసి నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై "మహాత్ముడు మరణించిన రోజున మౌనం పాటించాల్సింది పోయి చప్పట్లు కొడతారా?" అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.