Regina Cassandra: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రెజీనా

- బాలీవుడ్ కు సౌత్ స్టార్స్ అవసరం ఉందన్న రెజీనా
- అంతకు మించి బాలీవుడ్ కు మరో ఆప్షన్ లేదని వ్యాఖ్య
- కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయన్న రెజీనా
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల సినిమాలలో నటించిన రెజీనా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. పలు ఐటెం సాంగ్స్ లో కూడా రెజీనా మెరిసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ కు ప్రస్తుతం సౌత్ స్టార్స్ అవసరం ఉందని రెజీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కు అంతకు మించి వేరే ఆప్షన్ లేదని చెప్పింది. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని... దక్షిణాదికి చెందిన యాక్టర్లకు గతంలో బాలీవుడ్ అవకాశం దొరకడం కష్టంగా ఉండేదని... సౌత్ నుంచి వచ్చే వారికి అక్కడ ఛాన్సులు ఉండేవి కాదని తెలిపింది. భాషా పరమైన ఇబ్బందులు కూడా దానికి ఒక కారణం కావచ్చని చెప్పింది.
కరోనా తర్వాత పరిస్థితి మారిపోయిందని రెజీనా తెలిపింది. దక్షిణాది స్టార్స్ కు బాలీవుడ్ లో కూడా అవకాశాలు ఇస్తున్నారని చెప్పింది. వారి చిత్రాలను ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దక్షిణాది యాక్టర్లను తీసుకోవడం వారికి అవసరంగా మారిందని తెలిపింది.