All Party Meeting: రేపటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. ఢిల్లీలో కీలక భేటీ

All party meeting in Delhi ahead of union budget

  • రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
  • రేపు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. 
 
బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. ఎన్డీయే, ఇండియా కూటమిలోని పార్టీల నుంచి పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడంపై వీరు చర్చిస్తున్నారు. 

కేంద్ర బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. రేపు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు.

  • Loading...

More Telugu News