Anuja: ఓటీటీలోకి రాబోతున్న ఆస్కార్ నామినేటెడ్ మూవీ

Oscar nominated movie Anuja coming to OTT

  • ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన 'అనూజ'
  • నిర్మాతగా వ్యవహరించిన ప్రియాంకా చోప్రా
  • ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి 'అనూజ' చిత్రం చోటు దక్కించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం నామినేట్ అయింది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, గునీత్ మోంగా కలిసి నిర్మించారు. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు.

మరోవైపు ఈ సినిమా ఫిబ్రవరి 5న ఓటీటీలోకి వస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఈ మూవీ గురించి ప్రియాంకా చోప్రా స్పందిస్తూ... జీవిత గమనాన్ని మార్చే సినిమాగా ఈ మూవీ అందరినీ మెప్పిస్తుందని అన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News