Viral Video: ఆకాశంలో ఢీకొన్న విమానం-హెలికాప్టర్.. వీడియో ఇదిగో!

- అమెరికాలోని వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో ఘటన
- నదిలో పడిపోయిన విమాన, ఆర్మీ హెలికాప్టర్ శకలాలు
- విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు
అమెరికాలోని రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న విమానం ల్యాండ్ అవుతూ గాల్లోనే ఓ ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రెండూ పేలిపోయాయి. గత రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోటోమేక్ నది పైన ఈ ఘటన జరగడంతో విమాన, హెలికాప్టర్ శకలాలు అందులో పడిపోయాయి.
ప్రమాద మృతులు, ఇతర వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనతో విమానాశ్రయాన్ని మూసివేసినట్టు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మిలటరీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నదిలో గాలింపు మొదలు పెట్టారు. నదిలో ఫైర్ బోట్లను మోహరించారు.