Uttar Pradesh: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై కేటీఆర్, మహేశ్ కుమార్ దిగ్భ్రాంతి

Deeply saddened and anguished KTR on Maha Kumbh Stampede

  • 30 మంది మృతి చెందడం కలచివేసిందన్న కేటీఆర్
  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్
  • మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా ముప్పై మంది భక్తులు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ విషాద ఘటనపై వారు విచారం వ్యక్తం చేశారు.

తొక్కిసలాట కారణంగా కుంభమేళాలో 30 మంది మృతి చెందిన విషయం తనను కలచివేసిందని కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్

కుంభమేళా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News