Anjanadevi Konidela: తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి స్పెషల్ గ్లింప్స్

Chiranjeevi shares special glimpse on mothers birthday

  • నేడు చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు
  • కోలాహలంంగా మెగా నివాసం
  • తల్లితో కేక్ కట్ చేయించిన చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి నేడు (జనవరి 29) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా నివాసంలో సందడి నెలకొంది. మెగా కుటుంబ సభ్యులందరూ అంజనాదేవికి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఆమెపై పూల వర్షం కురిపించారు. అందరి నుంచి శుభాకాంక్షలు అందుకుంటూ, ఉత్సాహంగా నడుచుకుంటూ వచ్చిన ఆమె... కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తల్లి కోసం చిరంజీవి హ్యాపీ బర్త్ డే సాంగ్ ను కూడా పాడారు.

ఈ మేరకు చిరంజీవి తన తల్లి జన్మదిన వేడుకల గ్లింప్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. "అమ్మా... మాటల్లో వర్ణించలేనంత గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాం, నువ్వు ఊహించనంతగా నిన్ను గౌరవిస్తున్నాం అని ఈ ప్రత్యేకమైన రోజున నీకు చెప్పాలని కోరుకుంటున్నాం" అంటూ ఆ వీడియోకు చిరంజీవి క్యాప్షన్ పెట్టారు.

View this post on Instagram

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Anjanadevi Konidela
Birthday
Chiranjeevi
Mega Celebrations
  • Loading...

More Telugu News