Hostel: సూర్యాపేట బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్!

- విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలింపు
- చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించిన ఆర్డీవో, వైద్యాధికారి
- వసతి గృహానికి చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆహారం వికటించడంతో ఈ వసతి గృహంలో ఉంటున్న పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన బాలికలకు సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాలికలను ఆర్డీవో, వైద్యాధికారి పరామర్శించారు. బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు.
కొంతమంది విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతో వారిని మొదట అర్బన్ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు వసతి గృహానికి చేరుకున్నారు.