Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం అంటూ ప్రచారం ... పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

TTD complains over youtube channels over propaganda that Chaganti got insulted in Tirumala

  • ఇటీవల చాగంటికి తిరుమలలో అవమానం అంటూ కథనాలు
  • పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
  • కేసు నమోదు చేసుకున్న తిరుపతి పోలీసులు

ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ఇటీవల విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా పరిగణించింది. చాగంటికి తిరుమలలో అవమానం అంటూ ప్రచారం చేసినవారిపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనే యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి, దురుద్దేశంతో తప్పుడు కథనాలను ప్రచారం చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశామని... ఢిల్లీ, విజయవాడలో ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)కి కూడా ఫిర్యాదు చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అంతేకాకుండా, విష ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ మేనేజ్ మెంట్ కు కూడా టీటీడీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. 

చాగంటి కోటేశ్వరరావుకు ఉన్న క్యాబినెట్ హోదా ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న ఆయనకు టీటీడీ శ్రీవారి దర్శన ఏర్పాట్లను చేసిందని బీఆర్ నాయుడు వివరించారు. కానీ దీనిపై కొందరు దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా...  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠ ఉన్న టీటీడీని పలుచన చేసేలా దుష్ప్రచారం చేసే వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News