AP Tableau: రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శనలో ఏపీకి 3వ స్థానం... సీఎం చంద్రబాబు స్పందన

AP Tableau gets 3rd place in Republic Day Parade

  • రిపబ్లిక్ డే పరేడ్ లో వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన
  • నేడు ఫలితాలు వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ
  • యూపీ శకటానికి మొదటి స్థానం... రెండో స్థానంలో త్రిపుర శకటం 

ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన శకటాల ఫలితాలను నేడు వెల్లడించారు. ఇందులో ఏపీ ప్రభుత్వ శకటానికి 3వ స్థానం లభించింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. 

రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి మూడో స్థానం రావడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఈ ఫలితాల్లో... ఉత్తరప్రదేశ్ శకటానికి తొలిస్థానం దక్కిందని, త్రిపుర శకటం రెండో స్థానంలో, ఏపీ శకటం మూడో స్థానంలో నిలిచాయని చంద్రబాబు వివరించారు. 

ఈ సందర్భంగా శకటం రూపకర్తలకు, రాష్ట్ర అధికారులకు, ముఖ్యంగా ఏటికొప్పాక బొమ్మలు తయారుచేసే కళాకారులకు అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News