Nara Lokesh: అసర్ నివేదికతో విద్యావ్యవస్థలో విధ్వంసం బయటపడింది: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh opines on ASER

  • దేశంలోని విద్యా ప్రమాణాలపై అసర్ నివేదిక
  • 2022-24 మధ్య ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారాయన్న అసర్
  • జగన్ పై మంత్రి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు 

దేశంలోని విద్యా ప్రమాణాలపై యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER-అసర్) వెలువడడం తెలిసిందే. 2022-24 మధ్య కాలంలో ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారాయని అసర్ స్పష్టం చేసింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని తెలిపారు. 

ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యిందని లోకేశ్ విమర్శించారు.

"2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదికలో స్పష్టంగా వెల్లడించింది. అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు, తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం... ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండో తరగతి పుస్తకాలు సరిగా చదవలేని పరిస్థితి నెలకొంది. 

విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు గత ఏడు నెలలుగా అనేక చర్యలు తీసుకున్నాను. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలికాను. ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు అని పక్కా లెక్కలు తీయడం దగ్గర మొదలుపెట్టి... మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్యప్రణాళిక సిద్ధం చేయడం, విలువలతో కూడిన విద్య, విద్యార్థులను క్రీడలతో సహా ఇతర రంగాల్లో ప్రోత్సహించే గైడెన్స్ ఇవ్వడం, కనీస మౌలికవసతులు కల్పించడం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం వరకూ అనేక అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నాం. 

త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నాం" అని మంత్రి నారా లోకేశ్ వివరించారు.

Nara Lokesh
ASER
Education
Jagan
TDP
YSRCP
  • Loading...

More Telugu News