Naga vamsi: నిర్మాత నాగవంశీని వెంటాడుతున్న 'స్లీప్‌లెస్' కామెంట్స్!
![Sleepless comments haunting producer Naga vamsi](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a1ffa3458c.jpg)
- ఈ వారం బాలీవుడ్‌లో విడుదలైన 'డాకు మహారాజ్'
- 'డాకు మహారాజ్' నార్త్ ఇండియా కలెక్షన్ల విషయంలో నాగవంశీపై ట్రోల్స్
- మరోసారి తెరపైకి వచ్చిన నాగవంశీ 'స్లీప్‌లెస్' కామెంట్స్
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు నిర్మించే నిర్మాతల్లో నాగవంశీ ఒకరు. అంతేకాదు నిత్యం వార్తల్లో నిలవడానికి కూడా ఇష్టపడుతుంటాడు ఈ యువ నిర్మాత. ఇంటర్వ్యూల్లో ప్రెస్‌మీట్లలో కాంట్రావర్షియల్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ అవుతుంటాడు. ఇటీవల ఓ బాలీవుడ్ టెలివిజన్ నిర్వహించిన ఇయర్ ఎండింగ్ రౌండ్ టేబుల్ డిస్కషన్‌లో పాల్గొన్న నాగవంశీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యాలతో మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచాడు.
''పుష్ప-2 చిత్రం బాలీవుడ్‌లో సింగిల్ డేలో రూ. 80 కోట్లు కలెక్ట్ చేయడంతో బాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖులకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు" అని నాగవంశీ ఆ రౌండ్ టేబుల్ వ్యాఖ్యానించడంపై బాలీవుడ్ ప్రముఖులు సిద్దార్థ్ ఆనంద్, సంజయ్ గుప్తా, హన్సల్ మెహతా వంటి వాళ్లు ఈ యంగ్ ప్రొడ్యూసర్ కామెంట్స్‌ను విమర్శించారు. అయితే తాజాగా నాగవంశీపై మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణతో బాబీ దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'డాకు మహారాజ్' చిత్రాన్ని ఈ వారం నార్త్ ఇండియాలో విడుదల చేశాడు. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో కేవలం రూ.20 లక్షల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసిందని తెలిసింది. ఇప్పుడు నాగవంశీ 'పుష్ప-2' విషయంలో చేసిన కామెంట్స్‌కు ప్రతిస్పందనగా ఇప్పుడు నాగవంశీ తన సినిమా కలెక్షన్స్ చూస్తే నిజంగానే నిద్ర పట్టదు అంటూ ఆ స్లీప్‌లెస్ కామెంట్స్‌ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.