: అగ్రనేత అనూహ్య నిర్ణయంపై స్పందించిన సుష్మ
తాను స్వయంగా స్థాపించిన పార్టీకి అద్వానీ రాజీనామా చేయాల్సి రావడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అగ్రనేత రాజీనామాపై సుష్మాస్వరాజ్ స్పందించారు. అద్వానీ రాజీనామా ప్రకటన విన్న వెంటనే ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ నిర్ణయం ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. అయినా, అద్వానీని రాజీనామా ఉపసంహరించుకునేలా ఒప్పిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అగ్రనేతకు నచ్చచెప్పేందుకు ఆయన నివాసానికి వెళతానని ఆమె వెల్లడించారు.