Gottipati Ravi Kumar: జగన్ జల్సాలకు రూ. 19,871 కోట్ల ప్రజా ధనం వృథా చేశారు: మంత్రి గొట్టిపాటి రవి
![Gottipati fires on Jagan](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a0f13aa0a3.jpg)
- జగన్ కుటుంబం 8 లక్షల కోట్లు దోచుకుందన్న గొట్టిపాటి
- జగన్ తిన్న ఎగ్ పఫ్ ల ఖర్చే రూ. 3 కోట్లు అని విమర్శ
- రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొందని వెల్లడి
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ రెడ్డి కుటుంబం రూ. 8 లక్షల కోట్లు దోచుకుందని అన్నారు. జగన్ జల్సాలు, దుబారాలకు రూ, 19,871 కోట్ల ప్రజా ధనం వృథా చేశారని దుయ్యబట్టారు. జగన్ తిన్న ఎగ్ పఫ్ ల ఖర్చే అక్షరాలా రూ. 3 కోట్లు అని చెప్పారు. ప్రచార పిచ్చితో ఒక పత్రికకు రూ. 1,600 కోట్లు కట్టబెట్టారని విమర్శించారు.
ధాన్యం బకాయిలు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 22 వేల కోట్ల బకాయిలను తమ కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొందని చెప్పారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు తమ ప్రభుత్వం ఏడాదికి రూ. 71 వేల కోట్ల అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.