Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
![Markets ends in profits](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a0b7940635.jpg)
- రోజు మొత్తం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు
- 631 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 205 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే బాటలో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 631 పాయింట్లు లాభపడి 76,532కి చేరుకుంది. నిఫ్టీ 205 పాయింట్లు పెరిగి 23,163 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జొమాటో (6.79), టాటా మోటార్స్ (3.29), ఇన్ఫోసిస్ (2.83), అల్ట్రాటెక్ సిమెంట్ (2.38), టెక్ మహీంద్రా (2.31).
టాప్ లూజర్స్:
ఐటీసీ హోటల్స్ (5.00), భారతి ఎయిర్ టెల్ (1.19), మారుతి (1.18), ఏషియన్ పెయింట్ (0.87), ఐటీసీ (0.55).