Pawan Kalyan: కుంభమేళా తొక్కిసలాట బాధాకరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
![AP Deputy CM Pawan Kalyan Responds on Mahakumbh Mela Stampede](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a07fa8cf58.jpg)
- తొక్కిసలాటలో 20 మంది యాత్రికులు చనిపోవడం బాధించిందన్న పవన్
- ఇదొక దురదృష్టకర ఘటన అని పేర్కొన్న జనసేనాని
- తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈరోజు తెల్లవారుజామున తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 20 మంది వరకు యాత్రికులు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ తొక్కిలాట ఘటనపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని, 20 మంది చనిపోవడం ఆవేదనకు గురి చేసిందన్నారు.
మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఇదొక దురదృష్టకర ఘటన అని పవన్ పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లిన వారు అధికారుల సూచనలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలకు జనసేనాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.