Chandrababu: పెద్దిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
![CM Chandrababu orders to enquiry on Peddireddy family alleged land encroachment](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a06424e0a8.jpg)
- మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భారీగా భూ అక్రమణ
- పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు
- చంద్రబాబు ఆదేశాలతో విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోద బాయితో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపిన అనంతరం నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
కాగా, సీఎం చంద్రబాబుకు ఈ వ్యవహారంలో ప్రాథమిక నివేదిక అందినట్టు తెలుస్తోంది. అటవీప్రాంతంలోని 75 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా భావిస్తున్నారు.