Rakhi Sawant: పాకిస్థానీని మూడో పెళ్లి చేసుకోబోతున్న రాఖీ సావంత్
![Rakhi Sawant preparing for third marriage](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a0578b1805.jpg)
- ఇప్పటికే ఇద్దరితో విడిపోయిన రాఖీ సావంత్
- తాజాగా పాకిస్థానీ నటుడితో ప్రేమలో ఉన్నానని వెల్లడి
- త్వరలోనే తాము ప్రేమ వివాహం చేసుకోబోతున్నామని వివరణ
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాఖీ... ఇప్పుడు మూడో పెళ్లితో మరోసారి చర్చనీయాంశంగా మారింది. తను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, ఆయనను పెళ్లి చేసుకోబోతున్నానని రాఖీ ప్రకటించింది. తాజాగా తన ప్రియుడి వివరాలను వెల్లడించింది.
పాకిస్థానీ నటుడు, పోలీసు అధికారి అయిన డోడి ఖాన్ తో తాను ప్రేమలో ఉన్నానని రాఖీ తెలిపింది. తామిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని... త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని... తమది ప్రేమ వివాహమని చెప్పింది. తనది భారత్, ఆయనది పాకిస్థాన్ అని... ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపింది.
రితేష్ సింగ్ ను రాఖీ తొలి వివాహం చేసుకుంది. ఇద్దరూ బిగ్ బాస్ 15లో కూడా పాల్గొన్నారు. 2022లో బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. అదే సంవత్సరం ఆదిల్ ఖాన్ ను రాఖీ రెండో వివాహం చేసుకుంది. అయితే ఆదిల్ కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని రాఖీ ఆరోపించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో 2023లో ఇద్దరూ విడిపోయారు.