Ram Gopal Varma: ఆర్‌జీవీకి మ‌రోసారి ఏపీ పోలీసుల నోటీసులు

Once Again AP Police Issues Notices to Ram Gopal Varma

  • ఫిబ్ర‌వ‌రి 4న విచార‌ణ‌కు హాజరు కావాల‌ని పోలీసుల నోటీసులు
  • ఈ మేర‌కు వాట్స‌ప్ ద్వారా వ‌ర్మ‌కు నోటీసులిచ్చిన‌ ఒంగోలు రూర‌ల్ పోలీసులు
  • 4న సినిమా షూటింగ్ కార‌ణంగా తాను బిజీగా ఉంటాన‌న్న ఆర్‌జీవీ
  • 7వ తేదీన విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తాన‌ని వెల్ల‌డి

సోష‌ల్ మీడియాలో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేశ్‌ల‌పై అభ్యంత‌క‌ర పోస్టుల కేసులో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఏపీ పోలీసులు మ‌రోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్ర‌వ‌రి 4న విచార‌ణ‌కు హాజరు కావాల‌ని ప్ర‌కాశం జిల్లా ఒంగోలు రూర‌ల్ పోలీసులు ఆయ‌న‌కు వాట్స‌ప్ ద్వారా నోటీసులు ఇచ్చారు. 

అయితే, 4న సినిమా షూటింగ్ కార‌ణంగా తాను బిజీగా ఉంటాన‌ని, 7వ తేదీన విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తాన‌ని ఆర్‌జీవీ పోలీసుల‌తో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇక గ‌తంలో ఆయ‌న‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా విచార‌ణ‌కు హాజ‌రుకాని విష‌యం తెలిసిందే. 

ఆ త‌ర్వాత హైకోర్టును ఆశ్ర‌యించారాయ‌న‌. దీంతో న్యాయ‌స్థానం వ‌ర్మ‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల‌ని, పోలీసులు విచార‌ణ‌కు పిలిచిన‌ప్పుడు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని కోర్టు ఆర్‌జీవీకి సూచించింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌రోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు.  

  • Loading...

More Telugu News