Priyamani: ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోదు: ప్రియమణి
![Priyamani praises Mani Ratnam](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn6799bb60d29df.jpg)
- మణిరత్నం లెజెండరీ డైరెక్టర్ అన్న ప్రియమణి
- ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే వేరే సినిమాలను వదులుకోవడానికి కూడా సిద్ధమేనని వ్యాఖ్య
- హీరోయిన్లను ఆయన చాలా అందంగా చూపిస్తారని ప్రశంస
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియమణి... పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి... మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటోంది. హిందీలో 'ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సిరీస్ లో నటిస్తోంది. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. మరోవైపు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దర్శకుడు మణిరత్నంపై ప్రశంసలు కురిపించింది.
ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టమని ప్రియమణి తెలిపింది. ఆయన సినిమాలో అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదని చెప్పింది. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే... కమిట్ అయిన వేరే సినిమాలను కూడా వదులుకోవడానికి సిద్ధమని తెలిపింది. మణిరత్నం నుంచి ఫోన్ వస్తే నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపింది. హీరోయిన్లకు మణిరత్నం ఫేవరెట్ డైరెక్టర్ అని... వారిని తెరపై ఆయన చాలా అందంగా చూపిస్తారని చెప్పింది. దక్షిణాదిన లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం కూడా ఒకరని తెలిపింది.