BRS Party: బీఆర్ఎస్ పార్టీకి కళ్లు చెదిరే ఆస్తులు.. జాతీయ స్థాయిలో చర్చ

BRS Party Submitted Audit Report To EC and Party Has Huge Assets

  • ఏకంగా 16 వందల కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడి
  • బ్యాంకు బ్యాలెన్సే రూ.1110 కోట్లు
  • ఆడిట్ రిపోర్ట్స్ విడుదల చేసిన గులాబీ పార్టీ

తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆ పార్టీ తాజాగా విడుదల చేసిన ఆడిట్ రిపోర్టే దీనికి కారణం. గతేడాది మార్చి 31 నాటికి బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా రూ.1,618 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఈ రిపోర్టు వెల్లడించింది. 2023–24 లో బీఆర్ఎస్ కు వచ్చిన విరాళాలు, బ్యాంకు వడ్డీ కలిపి రూ.685.5 కోట్లు. అయితే, ఇదే పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అందుకున్న విరాళాలు రూ.289 కోట్లు మాత్రమే. దీనిని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, పార్టీ ఆస్తులు, విరాళాలు, నిర్వహణ ఖర్చులకు సంబంధించి బీఆర్ఎస్ ఆడిట్ రిపోర్టును కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ రిపోర్టులో వెల్లడించిన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల వివరాలు..

2024 మార్చి 31 నాటికి ఆస్తుల విలువ.. రూ.1,618 కోట్లు. ఇందులో రూ.1,110 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది.
2023‌‌‌‌-24 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న విరాళాలు, బ్యాంకు వడ్డీ కలిపి రూ.685.5 కోట్లు. ఇందులో నిర్వహణ ఖర్చులు రూ.254 కోట్లు.
2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల ఖర్చు రూ.197 కోట్లు
ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున సుమారు రూ.47 కోట్లను అభ్యర్థులకు అందించింది.
బహిరంగ సభల కోసం రూ.30 కోట్లు, ప్రకటనల కోసం రూ.75 కోట్లు, క్యాంపెయిన్ కు రూ.42 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.197.55 కోట్లు ఖర్చు చేసింది. 
 
వివిధ రాష్ట్రాలలో పార్టీ భవనాల కోసం..

ఢిల్లీలో ల్యాండ్ కోసం రూ.1.78 కోట్లు, భవన నిర్మాణానికి రూ.13.73 కోట్లు.. అంతకుముందు అద్దె భవనం ఖర్చులు రూ. 1.47కోట్లు, పూణెలో ఆఫీసుకు రూ.14.38 కోట్లు, నాగపూర్ ఆఫీసుకు రూ.8.60 కోట్లు, మధ్యప్రదేశ్ పార్టీ నిర్వహణకు రూ.25 లక్షలు, కోకాపేటలో 11 ఎకరాల భూమి కొనుగోలుకు రూ.7.07 కోట్లు, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రూ.17.10 కోట్లు, వాటి కోసం భూముల కొనుగోలుకు రూ.1.21 కోట్లను చెల్లించారు. ఫర్నీచర్ రూ.26.25 లక్షలు, కంప్యూటర్లు రూ.33.86 లక్షలు, వాహనాలు రూ.3.42 కోట్లు, ఏసీలు రూ.82.73 లక్షలు వెచ్చించారు. కార్యకర్తల ప్రమాద బీమాకు రూ.25.53 కోట్లు చెల్లించారు.

  • Loading...

More Telugu News