Nandigam Suresh: 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన నందిగం సురేశ్

- నందిగం సురేశ్ కు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
- ఈ ఉదయం జైలు నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ
- కాలర్ బోన్ నొప్పితో బాధ పడుతున్న సురేశ్
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ జైలు నుంది విడుదలయ్యారు. గత 145 రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు. వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న షూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఈరోజు ఉదయం ఆయనను జైలు అధికారులు విడుదల చేశారు. రూ. 10 వేల పూచీకత్తును సమర్పించాలని ఆయనను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన పూచీకత్తును సమర్పించారు.
నందిగం సురేశ్ ప్రస్తుతం కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కోసం ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా... కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ 7న నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.