biswabhushan harichandan: ఏపీ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు అస్వస్థత
![andhra pradesh ex governor biswabhushan harichandan hospitalized with critical health problem](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn6799809d2e98f.jpg)
- అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
- గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బిశ్వభూషణ్
- భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన కుమారుడు, ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు.
ఒడిశా బీజేపీలో కీలక నాయకుడిగా వ్యవహరించిన బిశ్వభూషణ్, 2004 నుంచి 2009 వరకు న్యాయ, రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుంచి 2023 వరకు ఏపీ గవర్నర్‌గా సేవలందించారు. 2023 ఫిబ్రవరి 23న ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 29 జులై 2024 వరకు ఆ రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించారు.
గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లోనూ అస్వస్థతకు గురై భువనేశ్వర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందారు.