Ramcharan: రామ్‌చరణ్‌ సినిమా లీక్‌లపై టీమ్‌ అలర్ట్‌!

Team alert on Ramcharan movie leaks

  • ఈ నెల 29నుంచి 'ఆర్‌సీ-16'  తాజా షెడ్యూల్‌ 
  • చిత్రీకరణ వివరాలు లీక్‌ అవ్వకుండా టీమ్‌ అలర్ట్‌ 
  • షూటింగ్‌ స్పాట్‌లో సెల్‌ఫోన్‌లు కూడా నిషేధం 

ప్రతి సినిమా నిర్మాణ సమయంలో, ఆ చిత్రానికి సంబంధించిన వార్తలు, ఫోటోలు, వీడియోలు లీక్ అవుతుండటం సాధారణమైపోయింది. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, అక్కడికి షూటింగ్ చూడటానికి వచ్చే వారు, అభిమానులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా సినిమాలకు ఎదురయ్యాయి.

ఇటీవల రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాలోని ఒక పాట కూడా ముందే లీక్ అయింది. తాజాగా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతోపాటు సినిమా షూటింగ్ విశేషాలు ఎప్పటికప్పుడు మీడియాలో వస్తుండటంతో చిత్ర బృందం అప్రమత్తమైంది. ఇకపై సినిమాకు సంబంధించిన విషయాలు లీక్ కాకుండా చూడాలని హీరో, దర్శకుడు టీమ్ సభ్యులకు సూచించారట. అంతేకాదు, ఈ సినిమాలో రామ్ చరణ్ గెటప్ కూడా ముందుగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈనెల 29 నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

ఇక షూటింగ్‌లో పాల్గొనే సిబ్బంది ఎవరూ కూడా చిత్రీకరణ సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదని ఆదేశించారట. అంతేకాకుండా సినిమా కథ, సన్నివేశాలకు సంబంధించిన సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని షరతులు విధించారట. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ ఒక క్రీడాకారుడిగా కనిపించనున్నాడని సమాచారం. ఇందుకోసం ఆయన సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని టాక్. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై కిలారు సతీష్ నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. 

Ramcharan
Rc16
Buchibabu sana
Ramcharan latest news
Tollywood
Entertainment
  • Loading...

More Telugu News