Varun Chakravarty: వరుణ్ సూపర్ 'ఫైవ్'... 171 పరుగులు చేసిన ఇంగ్లండ్

Varun Chakravarty takes five against England

  • రాజ్ కోట్ లో మూడో టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • 24 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్

ఇంగ్లండ్ తో మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో ఇంగ్లండ్ లైనప్ ను కకావికలం చేశాడు. ఓ దశలో 200 పైచిలుకు స్కోరు సాధిస్తుందనుకున్న ఇంగ్లండ్ జట్టు... వరుణ్ స్పిన్ మ్యాజిక్ తో మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 

ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్ 51, లియామ్ లివింగ్ స్టన్ 43, కెప్టెన్ జోస్ బట్లర్ 24 పరుగులు చేశారు. 

టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5, హార్దిక్ పాండ్యా 2, రవి బిష్ణోయ్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. 

  • Loading...

More Telugu News