Thandel: నాగచైతన్య 'తండేల్‌' ట్రైలర్‌ ఎలా ఉందో తెలుసా?

Do you know how the trailer of Naga Chaitanyas Thandel looks

  • వైజాగ్‌లో ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్‌ 
  • ఆసక్తికరంగా 'తండేల్‌' ట్రైలర్‌ 
  • ట్రైలర్‌ ఓపెనింగ్స్‌ తీసుకొస్తుందా?  

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్‌'. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ నేపథ్యంలో, ట్రైలర్‌ను ఈరోజు వైజాగ్‌లో విడుదల చేశారు మేకర్స్‌. 

ట్రైలర్‌ను చాలా ఆసక్తికరంగా కట్‌ చేశారు. ముఖ్యంగా నాగచైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి పెయిర్‌ బాగుంది. ఇద్దరి ప్రేమికుల మధ్య ఉండే సంభాషణలు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. హీరో, హీరోయిన్‌ ప్రేమించుకోవడం, రాజు 'తండేల్‌' గా మారడం, మత్స్యకారుడుగా సముద్రంలోకి వెళ్లిన రాజును సరిహద్దులో పాకిస్థాన్‌ సైన్యం బంధించడం... ఆ తరువాత రాజు అక్కడి నుండి ఎలా తప్పించుకున్నాడు.. నాగచైతన్య, సాయి పల్లవిలు మళ్లీ కలుసుకున్నారా? ఇలా ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్‌ ఉంది. 

అయితే ట్రైలర్‌లో చూపించిన ఈ కథ కాకుండా సినిమాలో మరిన్ని ట్విస్ట్‌లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే కథ మొత్తం ట్రైలర్‌లో చెప్పేయడం ఈ మధ్య సినిమాల్లో సర్వ సాధారణమైంది. అయితే కొన్ని సినిమాలకు ఇదే అడ్వాంటేజీగా నిలిచింది. అయితే 'తండేల్‌'కు ఈ ట్రైలర్‌ బజ్‌ తీసుకొస్తుందా? సినిమాకు ఓపెనింగ్స్‌ ఉంటాయా? లేదా అనేది ట్రైలర్‌ ఆడియన్స్‌కు నచ్చడం పైనే ఆధారపడి ఉంది. 

More Telugu News