Mac Drill: విశాఖ ఎయిర్ పోర్టులో మాక్ డ్రిల్... ఆందోళన వద్దన్న ఏపీఎస్డీఎంఏ ఎండీ

APSDMA will conduct mac drill in Visakha Airport tomorrow
  • తుపానులు, వరదలు వస్తే చేపట్టాల్సిన చర్యలపై మాక్ డ్రిల్
  • ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసం తగ్గించడమే లక్ష్యం
  • విపత్తుల వేళ ఎలా వ్యవహరించాలనేదానిపై అవగాహన
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) విశాఖ ఎయిర్ పోర్టులో రేపు (జనవరి 29) మాక్ డ్రిల్ నిర్వహించనుంది. తుపానులు, వరదలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై ఈ సన్నాహక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), ఏపీఎస్డీఎంఏ, ఎయిర్ పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ కు రూపకల్పన చేశారు. 

ఈ కార్యక్రమం ద్వారా... తుపానులు, వరదల తదితర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసం తగ్గించడమే లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు.

ఈ మాక్ డ్రిల్ లో పోలీసులు, వైద్య సిబ్బంది, ఆపద మిత్ర వాలంటీర్లు పాల్గొంటారు. దీనిపై ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ స్పందించారు. విశాఖ ఎయిర్ పోర్టులో మాక్ డ్రిల్ చూసి ప్రజలు భయాందోళనలకు గురికావద్దని తెలిపారు.
Mac Drill
Visakha Airport
APSDMA

More Telugu News