L2E Empuraan: మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న మోహన్ లాల్ 'L2ఇ ఎంపురాన్'

Mohan Lal L2E Empuraan set to release on March 27

  • మోహన్ లాల్ ప్రధాన పాత్రలో 'L2ఇ ఎంపురాన్'
  • ఇటీవల కొచ్చిలో టీజర్ విడుదల
  • చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి

మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహ‌న్ లాల్ టైటిల్ పాత్ర‌లో వస్తున్న భారీ చిత్రం L2ఇ ఎంపురాన్. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన లూసిఫర్ చిత్రానికి ఇది సీక్వెల్. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ  లైకా ప్రొడక్ష‌న్స్‌, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, ఆంటోని పెరుంబ‌వుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు,  త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లూసిఫ‌ర్‌, బ్రో డాడీ చిత్రాల తర్వాత మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ఇది. ఈ క్రేజీ మూవీతో జి.కె.ఎం.త‌మిళ్‌ కుమ‌ర‌న్ నేతృత్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. 

తొలి భాగం లూసిఫ‌ర్‌ హిట్ కావ‌టంతో సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో ముందుగానే అంచ‌నా వేసిన మేక‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఆదివారం నాడు కొచ్చిలో L2ఇ ఎంపురాన్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రంలో మంజు వారియర్, టొవినో థామస్ వంటి ప్రముఖ తారాగణం నటించింది.

More Telugu News