Virat Kohli: రంజీ బ‌రిలో విరాట్ కోహ్లీ... అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌!

Bad News for Virat Kohli Fans Awaiting Star Ranji Trophy Return Because there is No Live Coverage

  • గురువారం నుంచి రైల్వేస్ జ‌ట్టుతో ఢిల్లీ రంజీ మ్యాచ్‌
  • 13 ఏళ్ల రంజీ బ‌రిలో దిగుతున్న ర‌న్‌మెషీన్‌
  • అయితే, ఈ మ్యాచ్ లైవ్ క‌వ‌రేజీపై సందిగ్ధ‌త‌
  • బీసీసీఐ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఏర్పాట్లు చేయ‌లేద‌ని ఢిల్లీ క్రికెట్ సంఘం వెల్ల‌డి

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత రంజీ బ‌రిలోకి దిగ‌నున్నాడు. 2012లో చివ‌రిసారిగా యూపీపై ఈ ర‌న్‌మెషీన్ రంజీ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మ‌ళ్లీ ఇప్పుడే దేశ‌వాళీ క్రికెట్ బ‌రిలోకి దిగుతున్నాడు. ఎల్లుండి (గురువారం) నుంచి రైల్వేస్‌తో జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ త‌ర‌ఫున కోహ్లీ ఆడ‌నున్నాడు. ఆయుష్ బ‌దోనీ సార‌థ్యంలో ఢిల్లీ జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది. కాగా, కోహ్లీకి కెప్టెన్సీ ఆఫ‌ర్ వ‌చ్చినా తిర‌స్క‌రించాడ‌ని తెలుస్తోంది.

కాగా, త‌మ అభిమాన ప్లేయ‌ర్ ఆట‌ను టీవీల్లో వీక్షించాల‌నుకునే అభిమానుల‌కు షాక్ త‌గ‌ల‌నుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లైవ్ క‌వ‌రేజీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కైతే బీసీసీఐ ఈ మ్యాచ్ లైవ్ క‌వ‌రేజీపై ఎలాంటి ఏర్పాట్లు చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై తాజాగా ఢిల్లీ క్రికెట్ సంఘం స్పందించింది.  

"బీసీసీఐ ఏమైనా చివ‌రి నిమిషంలో లైవ్ క‌వ‌రేజీకి ఏర్పాట్లు చేస్తుందేమో తెలియ‌దు. ఇప్ప‌టివ‌ర‌కైతే మాకు ఎలాంటి స‌మాచారం లేదు. కామ‌న్‌గానైతే పెద్ద మ్యాచ్‌ల‌కు లైవ్ టెలీకాస్ట్ లేదా ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. బ్రాడ్‌కాస్ట‌ర్‌ను రోస్ట‌ర్ ప‌ద్ధ‌తిలో చేసేందుకు ముందుగానే నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంది" అని సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. 

ఇక లైవ్ ఇవ్వ‌డానికి కావాల్సిన సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేయాలంటే కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. మ‌ల్టీ కెమెరా సెట‌ప్‌ను రెడీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ మ్యాచ్ కు రెండు రోజులే మిగిలాయి. దీంతో ఈ మ్యాచ్ లైవ్ క‌వ‌రేజీ ఉంటుందా? ఉండదా? అనే విష‌యంలో సందిగ్ధ‌త నెలకొంది. 

  • Loading...

More Telugu News