Cab Driver: క్యాబ్ డ్రైవ‌ర్‌ను చిత‌క‌బాదిన మ‌హిళ‌.. వైర‌ల్ వీడియో!

Woman Allegedly Hits Cab Driver at Mumbai Airport After Missing Flight

  • ముంబ‌యి విమానాశ్ర‌యంలో షాకింగ్ ఘ‌ట‌న
  • ఎయిర్‌పోర్టుకు ఆల‌స్యంగా తీసుకురావ‌డంతో విమానం మిస్స‌యిందంటూ దాడి
  • నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియో

ముంబ‌యి విమానాశ్ర‌యంలో ఇటీవ‌ల షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ మ‌హిళ క్యాబ్ డ్రైవ‌ర్‌ను దుర్భాష‌లాడుతూ, చిత‌క‌బాదింది. ఎయిర్‌పోర్టుకు ఆల‌స్యంగా తీసుకురావ‌డంతో విమానం మిస్స‌యింద‌ని ఆరోపిస్తూ ఇలా క్యాబ్ డ్రైవ‌ర్‌పై దాడికి పాల్ప‌డిందామె. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. 

అయితే, ఇందులో డ్రైవ‌ర్ త‌ప్పు ఏమీ లేద‌ని ఆ మ‌హిళే ఆల‌స్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరిన‌ట్లు స‌మాచారం. దీంతో స‌ద‌రు మ‌హిళ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముంబ‌యి ట్రాఫిక్ పోలీసుల‌ను కోరారు. బాధిత క్యాబ్ డ్రైవ‌ర్ వెంట‌నే స‌మీప పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల‌ని నెటిజ‌న్లు సూచించారు. 

More Telugu News